అంతా ఆయనై ఏర్పాట్ల పరిశీలన..
హైటెక్స్‌లో టీఆర్ఎస్21 వ ఆవిర్భావ దినోత్సవం
ఆహ్వానాలు అందిన వారే సభకు రావాలి
వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారకరామారావు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన స్థలాన్ని ఆదివారం వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారకరామారావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణులు పండుగగా జరుపుకుంటారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన టీఆర్ఎస్పార్టీ ఏర్పడి 21 ఏళ్లు పూర్తి అయ్యాయని, హెచ్ ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని, ఆవిర్భావ దినోత్సవానికి మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం జీహెచ్ ఎం నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ వార్షికోత్సవంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆహ్వానాలు అందిన వారు మాత్రమే ఆవిర్భావ సభకు రావాల్సి ఉంటుందని, సభకు వారందరికీ పాసులు జారీ చేస్తామన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో, 3600 చోట్ల పట్టణాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరిచాలన్నారు.
హైటెక్స్‌లో ఆవిర్భావ సభ.. అంతా ఆయనై ఏర్పాట్ల పరిశీలన..
RELATED ARTICLES
Recent Comments