Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుసిద్ధి వెంకటేశ్వర్లకు ఘన నివాళి

సిద్ధి వెంకటేశ్వర్లకు ఘన నివాళి

సిద్ధి వెంకటేశ్వర్లకు ఘన నివాళి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణంలోని స్థానిక కొమురయ్య భవన్ లో సిద్ధి వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీపీఐ నాయకులు గణంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనివన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర నేతగా పేరు తెచ్చుకొని అనేక పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. సిద్ధి వెంకటేశ్వర్లు మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మోటపలుకుల రమేష్, విజేందర్, మాతంగి రాంచందర్, గంగసరపు. శ్రీనివాస్, కరీముల్లా, సోతుకు ప్రవీణ్, క్యాతరాజు సతీష్, పి శ్రీనివాస్, దోర్నాల తిరుపతి, కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments