Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీవో కూచన ప్రకాశ్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామ పరిధిలోని గణేష్ నగర్ లో ధరావత్ రాములుకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఎంపీవో కూచన ప్రకాష్, సర్పంచ్ గూబ తిరుపతమ్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి ఆస్తి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాలయ ఆస్తి నష్టం వాటిల్లిందని, కట్టుబట్టలతో ఉన్నామని బాధితుడు రాములు కంటతడి పెట్టుకున్నారు. కాగా, పరిస్థితిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీవో తెలిపారు. తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయలను ఏబీ ఆర్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments