Saturday, November 23, 2024
Homeజాతీయంరైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ల్యాండ్ పూలింగ్ విషయంలో ఆందోళన చెందవద్దు..
రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్సేనని, అన్నదాతల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే అరూరి నివాసంలో ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ రైతులతో ల్యాండ్‌ పూలింగ్‌ విషయమై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు ఉన్న అనుమానలను ఎమ్మెల్యే నివృత్తి చేశారు. కొంత మంది రాజకీయ లబ్ధి కోసం కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల పొట్ట నింపేదే కానీ, వారి పొట్టకొట్టేది కాదన్నారు. మరో రెండు రోజుల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, కమిషనర్ తో సమావేశం నిర్వహించి ల్యాండ్ పూలింగ్ పై రైతులకు పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఒంటిమామిడిపల్లి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేష్, పార్టీ మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, ఎంపీటీసీ రాజు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments