మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో సంక్షేమ హాస్టల్ ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు శివరాత్రి అనిల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావొస్తున్నా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మారకపోగా, రోజు రోజుకీ క్షీణిస్తోందని, తద్వారా విద్యా వ్యవస్థను భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశార. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పెనుభూతంగా మారాయన్నారు. మూడు పూటల భోజనం గాను కేవలం ఒక్కో విద్యార్థికి రాష్ట్రప్రభుత్వం రూ.33 మాత్రమే ఖర్చు పెడుతుందని, నేరాలు చేసి వచ్చిన ఖైదీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 ఖర్చు పెడుతోందని వాపోయారు. అంతే కాకుండా నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు కూడా రూ.62 మాత్రమే విద్యార్థికి అందిస్తోందని వాపోయారు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కార్తీక్, మహేష్, కృష్ణ, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలి
RELATED ARTICLES
Recent Comments