విడుదల చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర : యువత మత్తు పదార్థాలకు బానిసైతే జరిగే నష్టాలను గురించి దామెర మండలం తక్కళ్లపాడు గ్రామానికి చెందిన గోగ్గుర రంజిత్ కుమార్ మార్పు అనే షార్ట్ ఫిలిం రూపొందించారు. రంజిత్ కుమార్ ఫిలింలో నటిస్తూ.. డైరెక్ట్ చేసిన యూ ట్యూబ్ ఫిలిం ను ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ నేటి యువత సృజనాత్మకమైన ఆలోచనలు సమాజానికి అవసరమన్నారు.. మార్పు ఫిలిం ను ప్రతీ ఒక్కరుు చూసి యువత వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో దామెర వైస్ ఎంపీపీ జాకీర్ అలి, దాడి రమేష్, నెరేళ్ల కమలాకర్, కన్నెబోయిన రమేష్, కొత్తపల్లి కృష్ణ, దాడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
‘మార్పు’ షార్ట్ ఫిలిం రిలీజ్
RELATED ARTICLES
Recent Comments