Monday, April 7, 2025
Homeతెలంగాణబస్సు డ్రైవర్‌కు గుండెపోటు..

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు..

బస్సులో 45మంది స్వాములు
బస్సు డ్రైవర్ మృతి
ములుగు జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, ములుగు: తృటిలో పెను ప్రమాదం తప్పింది. 45 మంది భవానీ మాలాదారులు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకున్న ఈ ప్రమద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు చెందిన 45 మంది కుటుంబ సభ్యులు భవానీ మాలలు వేసుకున్నారు. అందరూ కలిసి తీర్థ యాత్రలు చేస్తూ భద్రాచలం దర్శనం చేసుకొని వెంకటాపురం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తున్నారు. ఈ క్రమంలో అంకన్నగూడెం వద్ద డ్రైవర్‌కు సడన్ గా గుండెపోటు రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి ఆగింది. హుటాహుటీన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా 108 ద్వారా వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే డ్రైవర్ బాబు అనే వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments