పాత బిల్లులే రాలే.. కొత్తగా పనులెలా చేయాలి..!
– గణపురంలో పల్లెప్రగతి సమావేశం బహిష్కరణ
-బిల్లులు చెల్లిస్తేనే పాల్గొంటామన్న అధికారపార్టీ సర్పంచులు
స్పాట్ వాయిస్, గణపురం: ‘పల్లె ప్రగతి’ లో భాగంగా గతంలో చేసిన పనులకే బిల్లులు రాలే’. ఇప్పుడు కొత్త పనులెట్ల చేయాలె’ అని గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐదో విడత పల్లె ప్రగతి సమావేశాన్ని సర్పంచ్ లు బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లు మాట్లాడతూ తమకు మొదటి విడత పల్లె ప్రగతి నుంచి నాలుగో విడత పల్లె ప్రగతి వరకు చేసిన పనులకే బిల్లులు ఇంతవరకు రాలేదని, ఇప్పుడు ఐదో విడత పల్లె ప్రగతిలో కొత్త పనులు ఎలా చేయాలని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు పూర్తి బిల్లులు చెల్లిస్తేనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు. ఇప్పటికే చేసిన పనులకు అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అప్పులు తీర్చలేక రాష్ట్రంలో కొంత మంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిందల్లా చేసుకుంటూ పోతే.. తమ పరిస్థితి కూడా అదోగతి అవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సర్పంచులకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాత బిల్లులే రాలే.. కొత్త పనులెట్ల చేయాలె..!
RELATED ARTICLES
Recent Comments