ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాలలో పేయింట్ షాపు ప్రారంభం
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన నూతన పేయింట్ షాప్ ను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం ఆనాడు అంబేద్కర్ పోరాడితే. ఈనాటి అభినవ అంబేద్కర్ కేసీఆర్ పేదవారికి అండగా ఉంటున్నారన్నారు. ఒక నాడు కూలీలుగా ఉన్నవారు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారారన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తిస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలును ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు అపోహలు కల్పిస్తున్నారని, వారికి ప్రజలే బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
RELATED ARTICLES
Recent Comments