థర్డ్ డిగ్రీ చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది
రైతుల పొట్టకొట్టే ప్రసక్తే లేదు
డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. శనివారం ఐనవోలులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దృష్టి సారించి రైతును రాజు చేసేందుకు అహర్నిశలూ కష్టపడుతోందన్నారు. వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిందని, రైతుల పొట్ట కొట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమాయక రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజెపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వ జనరంజక పాలనను చూసి ఓర్వలేకనే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పై అసత్యాలు ప్రచారం చేస్తూ నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. నల్ల చట్టాల రద్దు కోరుతూ ధర్నా చేసిన రైతుల పైకి కార్లు ఎక్కించి చంపించిన బీజేపీ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ రద్దు కోసం నిరంతరం పనిచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ల్యాండ్ పూలింగ్ రద్దుపై ప్రభుత్వం తరఫున రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పెరుమాండ్లగూడెంలో బందోబస్తులో ఉన్న పోలీసులతో జరిగిన గొడవలో కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు మాకు తెలియదని విచారణలో తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తేలితే చర్యలు
RELATED ARTICLES
Recent Comments