గ్రూప్-1 రద్దుపై డివిజన్ బెంచ్ కు టీఎస్‌పీఎస్సీ
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై మంగళవారం విచారిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. దీంతో గ్రూప్ రద్దుపై హైకోర్టు మంగళవారం విచారించనుంది.
Recent Comments