Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో బోనాల సంబురం

ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో బోనాల సంబురం

బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్న ఉపాధ్యాయులు
ప్రత్యేక వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు
స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ రామ్ నగర్ లోని ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో శనివారం బోనాల సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా అమ్మవారి చిత్ర పటాన్ని తయారు చేసి, కూరగాయాలో అలంకరించారు. అలాగే బోనాల కుండలను పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించి, అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, శివసత్తులు, పోతు రాజుల వేశాధారణలో నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అన్నారు. అషాడ మాసంలో వచ్చే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారన్నారు. విద్యార్థులకు తెలంగాణ లో జరుపుకునే పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో బోనాల సంబురాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ చార్జి, ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments