Sunday, November 24, 2024
Homeక్రైమ్ఉరేసుకుని యవకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యవకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యవకుడి ఆత్మహత్య
ఇద్దరు అక్కలు, తండ్రి మృతి జీర్ణించుకోలేక తనువు చాలించిన దిలీప్
స్పాట్ వాయిస్, టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణపూర్ (వీ) గ్రామానికి చెందిన యవకుడు లద్దునూరి దిలీప్ (20) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లద్దనూరి భద్రమ్మసారయ్య కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించిన భద్రమ్మ సారయ్య గతంలో పెద్ద కూతురుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే, ఉద్యోగం వచ్చేదాకా చేసుకోనని చెప్పింది. ఈ క్రమంలోనే మనోవేదన గురైన ఆమె పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సారయ్య అనారోగ్యంతో కొద్ది రోజులకే మరణించాడు. ఆ తర్యాత చిన్న కూతురును భూపాలపల్లి సింగరేణి ఉద్యోగికి ఇచ్చి వివాహం చేయగా, నాలుగు నెలలకే అదనపు కట్నం తేవాలని, పిల్లలు పుట్టడం లేదని భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో చిన్న కూతురిని అల్లుడు పుట్టింటి వద్ద దింపి వెళ్లాడు. దీంతో మనోవేదనతో గత ఏడాది ఆమె కూడా ఇదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో దిలీప్ తన ఇద్దరక్కలు, తండ్రి మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఆస్తులు అమ్మి కట్నంగా ఇచ్చిపెళ్లి చేస్తే, తన అక్క మృతికి కారకులైన వ్యక్తి బెయిల్ పై వచ్చి హాయిగా తన పని తాను చేసుకుంటూ జీవిస్తున్నాడని, తమకు మాత్రం న్యాయం జరగదనే ఉద్యేశంతో తీవ్ర మనోవేదనకు గురైన దిలీప్ శనివారం తల్లి భద్రమ్మ పనికి వెళ్లగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని చిట్యాల ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments