అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్థిక మంత్రి హరీష్ 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. కాగా హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. బడ్జెట్ కాపీలను చించేశారు. గవర్నర్ ప్రసంగం లేదంటూ నిరసనకు దిగారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్
RELATED ARTICLES
Recent Comments