పంథినిలో ఉచిత వైద్య శిబిరం..
సహృదయం చాటిన గురు రెయిన్ బో యువ డాక్టర్లు
స్పాట్ వాయిస్, వరంగల్ : కష్టపడి చదువుకుని డాక్టర్లు అయిన నలుగురు యువ డాక్టర్లు సమాజానికి తమవంతు సాయంగా ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని గురు రెయిన్ బో హాస్పిటల్ హెల్తీ పబ్లిక్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా వరంగల్ జిల్లా పంథిని గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు బోయిని రాజేష్ (ఎండీ జనరల్ మెడిసిన్), ఎ.రాకేష్ (మానసికవైద్యులు), బి.రఘు (పల్మొనాలజిస్ట్), బి.చేతన్ (ఈఎన్ టీ వైద్యుడు) పలువురికి బీపీ, షుగర్, ఎనీమియా, కొలెస్ట్రాల్, చెవి, ముక్కు, గొంతు, మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు చేసి మందులను కూడా అందజేశారు. పేద ప్రజలకు ప్రైవేటు వైద్యం ఆర్థిక భారంగా మారిన ఈ రోజుల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని గ్రామస్తులు కొనియాడారు. వైద్య శిబిరానికి సహకరించి విజయవంతం చేసిన సర్పంచ్ కె.పూర్ణ చందర్, కె.మాధవ రావు, ఎంపీటీసీకి గురు రెయిన్ బో హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్ల బృందం, గురు రేయిన్ బో హాస్పటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.
Recent Comments