ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ…
ధరణి తీసేస్తాం..
వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
* ఫాం హౌజ్ ఉన్న కేసీఆర్ గుండెలు అదిలేలా నినాదించాలే..
చారిత్రాత్మక ఘటన ఆవిష్కరణ చేసే సమయంలో వచ్చే కాంగ్రేస్ హయాంలో తీసుకొచ్చే అంశాలను ప్రవేశపెట్టారు.
* తెలంగాణ అంటే మాకు నినాదం కాదు.. ఎన్నికల ముడి సరుకాదు.. మాకు పేగు బంధం. మాకు ఆత్మగౌరవం. ఓరుగల్లు పేరు వింటే ఉద్యమం గుర్తుకొస్తుంది.
* తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ సీఎం అయి.. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశారు. వేలాది మందిని మరణాలకు కారణమయ్యారు.
* కాంగ్రెస్ పార్టీ లో 365 రోజుల్లో అధికారంలోకి వస్తుంది.
* ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం..
* ఇందిరమ్మ రైతు భరోసా పథకం తీసుకొస్తాం. రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.10లు అందిస్తాం.
* ఉపాధి హామీలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు 12వేల ఆర్థిక సాయం అందిస్తాం
* రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇస్తాం. చివరి గింజ వరకు కొంటం.
* తెలంగాణ లో మూతపడిన చెరుకు కర్మగారాలను తెరిపిస్తాం. పసుపు బోర్డు తీసుకొస్తాం. రైతుల జీవితాల్లో వెలుగు తెస్తాం.
* రైతులపై భారం లేకుండా మెరుగైన జీవన, సాగు విధానాన్ని తెస్తాం. పంట నష్టం జరిగితే వెంటనే సర్వే చేసి ప్రతీ రైతుకు పరిహారం అందిస్తాం.
రైతులకు, కూలీలకు రైతు బీమా వర్తింపజేస్తాం..
* ఉపాధి హామీని వ్యవసాయానికి అనుభందం చేస్తాం.
* పోడు భూములకు యాజమాన్య హక్కులు ఇస్తాం.
* రైతుల పాలిట శాపంగా ధరిణి పోర్టల్ తీసేస్తాం. అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా మంచి రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం.
* నకిలీ విత్తనాల బెడద లేకుండా చూస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ కారణమైన వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తాం. జైలుకు పంపిస్తం.
* రాష్ర్టంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయిస్తాం. చివరి ఎకరా వరకూ నీరందరిస్తాం. రైతుల పరిక్షణ, హక్కుల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం..
* పంటల ప్రణాళికలు రూపొందిస్తాం.. లాభసాటిగా పంటలను మారుస్తాం..
* వరి ధాన్యం కనీస ధర 1960 ఉన్న మద్దతు ధర ను పెంచుతాం. 2500 లు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తాం..
* మక్కలు ధరలకు 2200కు కొనుగోలు చేస్తాం
* కందులు 6300 నుంచి 6700 మద్దతు ధర పెడుతాం.
* పత్తి 6500 గిట్టుబాటు ధర చేస్తాం..
* మిర్చి రైతుల కోసం 15000 వేలకు క్వింటాల్ కొనుగోలు చేస్తాం..
* పసుపు 12000 పెట్టి కొనుగోలు చేస్తాం.
* ఎర్రజొన్న 4000, జొన్నలు 3500
Recent Comments