Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలురాజనాల శ్రీహరి ఒక బఫూన్

రాజనాల శ్రీహరి ఒక బఫూన్

సంజయ్ యాత్రపై మిడిమిడి తెలివితో మాట్లాడడం సరికాదు
ఆడెపు వెంకటేష్ బీజేపీ నాయకులు
స్పాట్ వాయిస్, వరంగల్ : రాజనాల శ్రీహరి ఒక పెద్ద బఫూన్ అని, ఆయనకు ఆయన గారికి సంబంధించిన పార్టీలో ఏ హోదా ఉందో కూడా అర్థం కాని విచిత్ర పరిస్థితి అని బీజేపీ నాయకులు ఆడెపు వెంకటేష్ చలోక్తి విసిరారు. సోమవారం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన రాళ్ల దాడిపై అవగాహనా లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం శ్రీహరికి సమంజసం కాదన్నారు. ఆ మాటకొస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజనాల శ్రీహరిని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అనాలో, లేదంటే గులాబీ పార్టీ కార్యకర్త అనాలో సరిగ్గా తెలియదన్నారు. పార్టీలో తనస్థాయి ఏంటో కూడా తెలియని ఆ పార్టీ జోకర్, బఫున్ రాజనాల శ్రీహరి అని దుయ్యబట్టారు. రాజనాల శ్రీహరి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని, కార్యకర్తల తలలు పగిలితే దాన్ని కూడా రాజకీయం చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో జనాలు లేనందున అందరి దృష్టి ఆకర్షించాలని, ఇలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ చేసిందని రాజనాల శ్రీహరి మాట్లాడటం అవగాహనలోపానికి, ఆయన అవివేకానికి, ముర్ఖత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇలాంటి పనికి మాలిన రెచ్చగొట్టే మాటలు మరోసారి చేస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, జాగ్రత్తగా మసులుకుంటే మంచిందని రాజనాల శ్రీహరిని వెంకటేష్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments