Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుయువతకు కేటీఆర్ ఆదర్శం

యువతకు కేటీఆర్ ఆదర్శం

 మంత్రి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..బంగారు తెలంగాణ సాధన కోసం యువ నాయకుడు కేటిఆర్ కు భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తండ్రితోపాటు ఎంతో చురుకుగా పాల్గొని బంగారు తెలంగాణ సాధనలో కూడా కేసీఆర్ కు అన్ని విధాలుగా సహాయపడుతూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి కృషిచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ప్రతిఏటా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. అందరూ కలిసి ఆకుపచ్చని ఆదర్శ జిల్లాగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీ నర్సింగారావు, మహిళా అధ్యక్షురాలు మేకల రజిత, పీఎసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మొగులోజు రవీందర్ నాయకులు మహాల్ రావు, దాసరి రవి, పిన్నింటి శ్రీనివాసరావు, మాధవరావు, అంజద్, చీటి కృష్ణ, హాఫిజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments