మార్కెట్లోకి కాంపోజిట్ సిలిండర్లు
విడుదల చేసిన ఐవోసీఎల్..
ఐదు, పది కిలోల పరిమాణంలో ప్రజలకు అందుబాటులోకి…
స్పాట్ వాయిస్, సుబేదారి : మారుతున్న వంటింటి అవసరాలకు అనుగుణంగా ఇండేన్ వాడకందారులు సులభంగా వినియోగించే కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చాయని ఐఓసీఎల్ రామగుండం విక్రయ అధికారి అలోక్ రెడ్డి, హుజురాబాద్ అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్ట్ నర్ పీవీ మదన్ మోహన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడే సంప్రదాయ ఇండేన్ సిలిండర్ కన్న తక్కువ బరువుతో లభించే కాంపోజిట్ సిలిండర్లో ఎంత గ్యాస్ వుందో తెలుసుకోవచ్చన్నారు. పేలుడు నుంచి రక్షణ, యూవీ ప్రొటెక్షన్ తో చుట్టబడిన ఫైబర్ తో తయారు చేయబడ్డాయని పేర్కొన్నారు. ఐదు, పది కిలోల పరిమాణంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నూతనంగా మార్కట్ లోకి విడుదలైన పదికిలోల కాంపోజిట్ సిలిండర్ డిపాజిట్ రూ. 3350తో పాటు రీఫిల్ ధర రూ.770.50 లని వారు తెలిపారు. అలాగే, కాంపోజిట్ సింగిల్ సిలిండర్ తో నూతన కనెక్షన్లు పొందేవారు 4485 డిపాజిట్ రీఫిల్ ఇతర చార్జీలు చెల్లించాలని స్టౌ కొరకు అదనపు చార్జీలు ఎమ్మార్పీ రేటు ప్రకారం చెల్లించాలని తెలిపారు. జంటనగరాల్లో లభ్యమయ్యే ఈ సిలిండర్లను వివిధ ఇండేన్ గ్యాస్ డీలర్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని వారు ఆ ప్రకటనలో తెలిపారు.
మార్కెట్లోకి కాంపోజిట్ సిలిండర్లు
RELATED ARTICLES
Recent Comments