Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుపేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి..

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి..

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి..
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర : కల్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ లోని ఎమ్మెల్యే చల్లా నివాసంలో ఆదివారం పరకాల, ఆత్మకూరు, నడికూడ, దామెర మండలాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు రూ. 91,10, 556 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ధర్మారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరఫున రూ.లక్షకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైందన్నారు. ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లలకు మేన మామలా తోడుంటున్నారని కొనియాడారు. ఆసరా పింఛన్ డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. వంద మాత్రమే ఇస్తోందని, మిగతావన్నీ కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. కేవలం రూ. వంద ఇస్తూ అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే అభివృద్ధది ఎలా ఉందో అర్థమవుతుందని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నార్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకులు గ్రామాల్తలో తిరిగి రోజులు లేవని, అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ గరిగె కల్పనా కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, రైతు బంధు మండల అధ్యక్షుడు బిల్లా రమణా రెడ్డి, సర్పంచులు సాంబయ్య, రాజేందర్, మెంతుల రాజు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments