నర్సంపేటకు మరో బీసీ రెసిడెన్షియన్ స్కూల్
జీవో నెంబర్ 17ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పెద్ది
స్పాట్ వాయిస్ నర్సంపేట : కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 33 బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను మంజూరు చేస్తూ జీవో 17 ను ఆదివారం విడుదల చేసింది. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి మరో ఎంజేపీటీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
ఎడ్యుకేషనల్ హబ్
నర్సంపేటను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల) – నెక్కొండ, ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలుర) – నల్లబెల్లి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) – దుగ్గొండి, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల) – నర్సంపేట, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలుర) – నర్సంపేట, గిరిజన సైనిక్ పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల (బాలుర) – పాకాల అశోక్ నగర్, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలుర) – మహేశ్వరం, ఆశ్రమ బాలికల జూనియర్ పాఠశాల – నల్లబెల్లి ఉండగా నూతనంగా ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల – నర్సంపేటకు మంజూరైంది. దీంతో మొత్తంగా నర్సంపేట నియోజకవర్గంలో తొమ్మిది రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల ద్వారా నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందనుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాగా, పాఠశాల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పెద్ది తెలిపారు.
Recent Comments