గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్ : గెలుపే లక్ష్యంగా అందరం పనిచేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆదివారం తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భరత్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లా పరిధిలోని అన్ని మండలాల, డివిజన్ అధ్యక్షులు కష్టపడి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను, కేంద్రం నుంచి వస్తున్న నిధుల గురించి ప్రతీ కార్యకర్త గ్రామ స్థాయిలో తెలిసేలా ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
RELATED ARTICLES
Recent Comments