గొర్రెల మందపై కుక్కల దాడి
20 జీవాలు మృతి..
10 గొర్రెలకు తీవ్రగాయాలు
స్పాట్ వాయిస్, జనగామ : గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 20 జీవాలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గానుగుపహాడ్ కు చెందిన రేసు వెంకటయ్య గొర్రెలు కాస్తూ జీవిస్తున్నాడు. రోజులాగే గొర్రెలను పాకలోకి పంపి భోజనం కోసం ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేలోగా 30 జీవాలపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 20 గొర్రెలు చనిపోగా, 10 జీవాలు తీవ్రంగా గాయపడ్డాయని బాధిత రైతు వెంకటయ్య వాపోయాడు. కాగా, వెంకటయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, జీఎంపీఎస్నాయకులు కోరుతున్నారు.
కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
RELATED ARTICLES
Recent Comments