అవినీతి రహిత ప్రజా సేవ చేయాలి
ఉద్యోగ సాధనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట 28: అవినీతి రహిత ప్రజాసేవ చేసేందుకు యువత ముందుకు రావాలని జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్రిపరేషన్ లో అనుసరించాల్సిన విధానాలను జేడీ లక్ష్మీనారాయణ వారికి వివరించారు. అనంతరం జేడీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రజాసేవకులని, జాబ్ సాధించడానికి పాజిటివ్ దృక్పథం.. సబ్జెక్ట్ పై అవగాహన చాలా ముఖ్యమన్నారు. సరైన ప్రణాళిక రూపొందించుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలన్నారు. ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉన్నాం… ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాం అనేది తెలుసుసుకుని ఆయా సబ్జెక్ట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. కేవలం ప్రశ్నలు, జవాబులు మాత్రమే చదవడం కాకుండా సబ్జెక్ట్ పై లోతైన విశ్లేషణ చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగ సాధనలో ఉన్నవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఏ పని చేసిన నిజాయితీ, నిబద్దతతో చేయాలని, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడంలో యువత ముందుడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రహిత ప్రజా సేవ చేయాలి
RELATED ARTICLES
Recent Comments