అటవీశాఖ రేంజర్‌పై ఆదివాసీల దాడి
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. మృతి
స్పాట్ వాయిస్, భదాద్రి: అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం ఆదివాసీలు ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలిసి అక్కడికి వెళ్లారు. చెట్లను నరకవద్దని గుత్తి కోయలకు అధికారులు సూచించారు. తమను అడ్డుకోవద్దని అధికారులను బెదిరించారు. అంతటితో ఆగకుండా రేంజర్ శ్రీనివాసరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న శ్రీనివాసరావును అటవీ సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అధికారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Recent Comments